ఫౌండేషన్ కోసం నాలుగు సత్యాలు

3/10/1999

(ఆఫ్రికాలోని ఒక గ్రామంలో ఒక పెంటెకోస్టల్ డినామినేషన్ వ్యక్తీకరణ వద్ద ముగ్గురు సోదరుల చేత ఇది విస్తృతంగా పలకబడింది. ఒక రోజులో ఆ “సమాజం” మొత్తం యేసు పట్ల తీవ్రంగా స్పందించి, ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదు. అత్యంత వ్యక్తిగత వ్యయంతో, ఆ గ్రామంలో చాలా మందిని మరియు వారి ఆర్థిక నిర్మాణాన్ని శాశ్వతంగా మారుస్తూ చాలా మార్పులు చేయబడ్డాయి. కొన్ని గంటల వ్యవధిలోనే మానవాతీత కార్యమేదో జరగబోతుందని వారి ప్రాంతంలో ఉన్న ఇతర మత సమూహాలలో పాకింది. అక్కడ ఉన్న ఆ మత సమూహాలలో ఈ ఆలోచనలు అన్నీ కలిగిన తరువాతి గంటలో అక్కడ ఉన్న స్థానిక సోదరులు చెప్పిన విషయాలను బాధరపరచి చూపించగలిగే అవకాశం ఉండుంటే బాగుండేది అని నేను కోరుకుంటున్నాను. ఆ రోజు ఆ సమయంలో వారి నిజమైన ప్రేమ, చర్యల ద్వారా వ్యక్తపరచిన ధైర్యాన్ని, తండ్రి ఇంటి పట్ల వారికున్న ఉత్సాహాన్ని చూడడం అప్పటికి, ఇప్పటికీ మరియు ఎప్పటికీ అద్భుతమైనది, ఉత్తేజకరమైనది.)

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేవుని బిడ్డలను మెల్కొల్పడమే ఒక విలువైన నిధి. మన రాజైన యేసయ్యను మరింత పొగడదనికి మరియు అతని కల నెరవేరేలా చూడడానికి, మన జీవితాన్ని మరియు చర్చి వ్యక్తీకరణ విధానాన్ని మార్చే ప్రత్యేక సత్యాలు ఎప్పుడూ మన బైబిల్ లో ఉన్నాయి! పరిశుధ్ధ ఆత్మ ద్వారా ఈ అందమైన సత్యాలను చూడడానికి మన కళ్ళు తెరవబడతాయని మన ఆశ! మనమందరం కలిసి దృఢoగా అవ్వాలని దేవుడు తన ఇంటిని నిర్మించాలి అనుకుంటాడు. అతను తన ఇంటిని నిర్మించాలి అని కోరుకుంటున్నాడు, తద్వారా నరకం యొక్క ద్వారాలు ఇంకా వ్యాప్తి చెందవు కాబట్టి. సంబంధాలు స్వస్థపరిచేందుకు అతను తన ఇంటిని నిర్మించాలి అనుకుంటున్నాడు. మన శరీరాలను, మనసులను మరియు ఆత్మలను స్వతంత్రంగా స్వస్థపరిచగలడు కాబట్టి అతడు అతని ఇంటిని నిర్మించాలి అనుకుంటున్నాడు. ఆయన తన ఇంటిని నిర్మించాలని కోరుకుంటున్నాడు, తద్వారా మనం బలంగా మరియు తెలివిగా ఉండగలము, మరియు యేసు సువార్త మునుపెన్నడూ లేనంత బలంగా ముందుకు సాగవచ్చు.

ఈ విషయాలు వినడానికి మీకు ధైర్యం ఉందా? మీరు ఈ విషయాలు విని మీరు దేవుని వాక్యాన్ని పాటిస్తారా? ఏదేమైనప్పటికీ మీరు మీ జీవితాన్ని మార్చుకుంటారా? పాటించటానికి మరియు రిస్క్ చేయడానికి మీకు ధైర్యం ఉంటే, దయచేసి చదవడం కొనసాగించండి.

నిర్మాణానికి నాలుగు సత్యాలు ఉన్నాయి. అవి లేకుండా దేవుని ఇల్లు ఎప్పటికీ దృఢంగా ఉండదు మరియు నరకము యొక్క ద్వారాలు ఇంటిని కదిలిస్తూనే ఉంటాయి. ఏదేమైనప్పటికీ, మనం ఈ నాలుగు విషయాలను అర్థం చేసుకుని పాటించి, ఈ దేవుని సత్యాల కోసం ధైర్యంగా నిలబడి హానిని కూడా స్వీకరించడానికి సిద్ధమైతే, అప్పుడు దేవుడు ఈ చర్యకు మనల్ని గౌరవించి తన శక్తిని మన జీవితాలలోకి పంపుతాడు. పెదలు ధనవంతులుగా మరియు బలహీనులు బలవంతులుగా అవ్వచ్చు. ఇది ఎల్లప్పుడూ దేవుని హృదయం మరియు ఉద్దేస్యం. కానీ, ఈ నిధిని మన దగ్గర నించి మొదటి శతాబ్దంలోనే దొంగలించడం జరిగింది. మానవుల ఉత్త సాంప్రదాయాలతో మనం దోచుకొనబడ్డాము.

మొదటి నిజం: క్రైస్తవుడు అంటే ఎవరు?

మొట్టమొదటి సత్యమేమిటి అంటే క్రైస్తవుడు అంటే ఏమిటో సరిగ్గా నిర్వచించడమే. ప్రపంచవ్యాప్తంగా మరియు ప్రతి సంస్కృతిలో దీని గురించి మేము చాలా నిరాశతో ఉన్నాము. ఎందుకు అంటే క్రైస్తవుడు అంటే ఏమిటో స్పష్టంగా తెలియకుండానే ఇన్ని రోజులు ఉన్నాం మరియు దేవుని ఇంటిని చాలా వరకు ఇసుకతో నిర్మించినట్లు అయింది. ఒకరు క్రైస్తవుడు అవ్వాలి అంటే భావాలను బట్టి, ఉద్దేశాలను బట్టి లేదా కుటుంబ తీరును బట్టి నిర్వచించాం. ఒకరు క్రైస్తవుడు అవ్వాలి అంటే అతనికి సరైన నమ్మకాలు ఉండాలని నిర్వచించాం. ఒకరు క్రైస్తవుడు అవ్వాలి అంటే అతను బాగా పాడుతున్నాడా, ప్రార్ధనలకు హాజరావుతున్నాడా అని చూస్తాము. కానీ యేసు క్రైస్తవత్వాన్ని ఆ విధంగా నిర్వచించలేదు. “మీరు అన్నింటినీ విడిచిపెట్టకపోతే, మీరు నా శిష్యులు అవ్వలేరు,” అని యేసు చెప్పాడు. “మీరు ప్రతిరోజూ మీ సిలువను తీసుకుంటే తప్ప, మీరు నన్ను అనుసరించలేరు,” అని చెప్పాడు. బుక్ ఆఫ్ ఆక్టస్ లో, “శిష్యులను అంత్యోక్రియలో మొదట ‘క్రైస్తవులు’ అని పిలిచేవారు,” అని బైబిల్ చెబుతుంది. కాబట్టి మీరు యేసు భోధనలలో ఎప్పుడు “శిష్యుడు” అనే పదం కనిపించినా మీ మనసులో “క్రైస్తవుడు” అనే పదాన్ని గుర్తు తెచ్చుకోండి. మీరు అన్నింటినీ విడిచిపెట్టకపోతే, మీరు నా శిష్యులు అవ్వలేరు అని యేసు చెప్పినప్పుడు, మీరు మీ జీవితాన్ని విడిచిపెట్టకపోతే మీరు క్రైస్తవుడు కాలేరు అని యేసు అర్థం. మీరు ప్రార్ధనలకు హాజరు కాకపోతే మీరు క్రైస్తవులు కాలేరు అని అతడు చెప్పలేదు. మీరు బైబిల్ చదవకపోతే మీరు క్రైస్తవులు కాలేరు అని అతడు చెప్పలేదు. మీరు డబ్బులు ఇవ్వకపోతే మీరు క్రైస్తవులు కాలేరు అని అతడు చెప్పలేదు. మీరు మీ స్వయంగా చనిపోతే తప్ప మీరు క్రైస్తవులు కాలేరు అని అతడు చెప్పాడు.

వారికి వారు స్వయంగా చనిపోయే వారికోసం యేసు ఎదురు చూస్తున్నాడు. వారు యేసుతో రావడానికి సర్వస్వం వదిలేస్తారు. వారు అతనిని అనుసరించడానికి గర్వాన్ని మరియు ఇతర వస్తు వాంఛలను వదిలేస్తారు. వ్యక్తిగత పాపాలకు మరియు స్వార్ధానికి వారు దూరంగా ఉంటారు. వారిని వారు ప్రేమించే దానికంటే ఇతరులనే ఎక్కువగా ప్రేమిస్తారు. యేసుతో ఈ సంబంధం వారు ప్రతిరోజూ ఎలా ప్రవర్తిస్తారో దానిని బట్టి మారుతుంది.

మనం యేసు చెప్పిన విధంగా “క్రైస్తవుడు” అనే దానిని నిర్వచించితే తప్ప, యేసు నిర్మించిన ఇల్లు సురక్షితంగా ఉండదు. లేదంటే కూలిపోయి మట్టి లాగా మారి కొట్టుకుపోతుంది. మనం యేసు చెప్పిన విధంగా పాటించకుండా, ప్రార్థనలు వినడం, మాట్లాడడం మరియు పాడటం వంటి వాటిని ఆధారంగా చేసుకొని క్రైస్తవ తత్వాన్ని నిర్వచించినట్లైతే ఆ గృహం కూలిపోతుంది అని మనా రాజైన యేసు చెప్పాడు. అలా నిర్మించిన గృహం మనకు ఆహ్లాదకరం మరియు ఆనందం అవ్వచ్చు కానీ ఏసుకు అది ఏమీ కాదు. మనం పాటలు పాడుతూ సమావేశం అవుతున్నాం కాబట్టి ఆ గృహం మనకు కొద్దిపాటి ఆనందాన్ని అయినా కలుగజేయవచ్చు కానీ యేసు దానితో సంతృప్తి చెందనంత వరకు దాని వలన ఉపయోగమేమీ ఉండదు. మన జీవితాలలో ఇప్పటికీ సైతానే యుద్దం గెలుస్తున్నపుడు అర్థం ఏంటి. మనం యేసుని సంతృప్తి పరిచే జీవితం మరియు చర్చి నిర్మించలేనప్పుడు మనం మన మరియు దేవుని సమయం వృధా చేస్తున్నట్లే.

తీవ్ర పరిణామాలు :

దేవుని ఇంటిని నిర్మించడంలో మొట్ట మొదటి పునాది రాయి ఏంటంటే ఒక క్రైస్తవుడు అంటే ఏమిటో బైబిల్ వివరించే విధానంలో నిర్వచించడం. దేవుడు ఎవరిని క్రైస్తవుడని అంటాడో దాని ప్రకారంగా మనం మన నిర్ణయాలు తీసుకోవాలి. ఒక వ్యక్తి దేవుని చర్చిలో సభ్యుడిగా ఉండి క్రైస్తవుడు కాకుండా ఉంటాడా? కచ్చితంగా కాకుండా ఉండడు! కానీ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు మరియు క్రైస్తవేతరులు ఇద్దరూ చర్చిలో భాగం కావడం సరైందేనని ప్రజలకు బోధిస్తున్నారు. కానీ ఇది నిజం కాదని బైబిల్ చెబుతోంది! 1 కోరింథీయుల 5 లో, “సమూహంలోని కలుపు మొక్కను తొలగించమని” బైబిల్ చెబుతుంది. చర్చి నుండి పాపాన్ని తొలగించండి. దీనిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, “చిటికెడు ఉప్పు కూడా పాలను విరిచేస్తాయి,” అని దేవుడు చెప్పాడు. అదే విధంగా ఆ కలుపు మొక్క కూడా మొత్తం సమూహాన్ని చెడకొడుతుంది అని అర్థం.

జెరిఖో గోడలు కూలిపోయినప్పటి సంఘటన మీకు గుర్తుందా? దేవుని ప్రజలు అతీంద్రియ మార్గంలో శక్తివంతులుగా ఉన్నారు. ఏదేమైనా, జెరిఖో గోడలు పడిపోయిన వెంటనే, ఇజ్రాయెల్ యుద్ధంలో ఓడిపోయింది. వారు అణిచివేయబడ్డారు! ఇజ్రాయెల్ యుద్ధంలో ఎందుకు ఓడిపోయింది? ఎందుకంటే ఇశ్రాయేలు మొత్తంలో కేవలం ఒక్క వ్యక్తి తన గుడారంలో పాపం చేసాడు కనుక. మొత్తం చర్చిలో ఒక వ్యక్తి తన జీవితంలో పాపం చేసి దాగి ఉన్నందున దేవుడు చాలా కలత చెందాడు. అతడు ఆచన్. తన గుడారం కింద ఒక విగ్రహాన్ని తవ్విపెట్టి దాచాడు. దాని కారణంగా దేవుడు మొత్తం ఇస్రేల్ కు ఘోర ఓటమికి గురిచేశాడు. దేవుడు నిన్న, ఇవాళ, రేపు మరియు ఎప్పటికీ ఒకేలా ఉంటాడు కదా? ఇప్పటికీ చర్చి లోని వారి జీవితాలలో దాచి ఉన్న పాపాల వలన ఆ ప్రజల పట్ల దేవుడు అసంతృప్తిగానే ఉన్నాడు. ఇది అతని హృదయాన్ని విరిచేస్తుంది. దీనికి దేవుడు తీర్పు తీసుకొస్తాడు అని బైబిల్ చెబుతుంది.

యేసుకు తన జీవుతాన్ని ఎప్పుడు ఇవ్వకుండా చర్చిలో వచ్చి వారు భాగం అవతారు అని మనం అంటే అది సరైనదేనా? కాదు! ఇది చాలా పెద్ద పొరపాటు. ఎప్పుడు యేసుకు తన జీవితాన్ని అర్పించకుండా క్రైస్తవుడు అని చెప్పుకునే వారి వలన దేవుడు మొత్తం ఇంటికి తీర్పు ఇస్తాడు. కాబట్టి, దేవుని పని చేసే మహిమాన్వితమైన సభను మనం చూడాలనుకుంటే, మనం చేయవలసిన మొదటి పని “క్రైస్తవుడు” అనే పదాన్ని యేసు చెప్పిన విధంగా నిర్వచించడం. “మీరు అన్నింటినీ విడిచిపెట్టకపోతే, మీరు నా శిష్యులు కాలేరు”, “మీరు నాకన్నా తండ్రి, తల్లి మరియు పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తే, మీరు నా శిష్యులు కాలేరు”, “మీరు ప్రపంచాన్ని మరియు ప్రపంచ వస్తువులను ప్రేమిస్తే, మీరు నా శత్రువు అవుతారు,” “దేవుడు అహంకారాన్ని వ్యతిరేకిస్తాడు మరియు వినయస్థులకు దయను ఇస్తాడు,” అని గ్రంధాలు చెబుతున్నాయి.

ఒక క్రైస్తవుడు అంటే ఒక చర్చి సభ్యుడు అంటే ఎంటో మనం ఖచ్చితంగా నిర్వచించాలి. మీరు ఇంట్లో, పనిలో లేదా ఎక్కడున్నా మీ హృదయం యేసుకు చెందనప్పుడు, మీరు యేసు రక్తంతో శుద్ది చేయబడ్డారు అని, యేసు శరీరంలో భాగమని, మీరు ఒక క్రైస్తవుడు అని చెప్పుకోలేరు. మీ సంబంధాలు పవిత్ర సంబంధాలు కాకపోతే, మీరు పశ్చాత్తాపపడి మీ జీవితాన్ని యేసుకు అర్పించాలి.

రెండవ నిజం: నాయకత్వం అంటే ఏమిటి?

మనం ఖచ్చితంగా నిర్వచించాల్సిన రెండవ విషయం, దేవుని ఇంటికి రెండవ పునధి రాయి, ఏంటంటే దేవుని ఇంట్లో నాయకత్వం అంటే ఏంటి అనేదే. ఇది చాలా అద్భుతమైన నిజం. ఇది మిమ్మల్ని ప్రేరేపించి మీ జీవితాలను మారుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో, చర్చిలోని నాయకత్వం గురించి మనమంతా ఒక పెద్ద పొరపాటు చేశాం. చాలా చోట్ల ప్రార్ధనా సభలలో లేదా బైబిల్ పాఠశాలల్లో, బైబిల్ చదివేవారు లేదా పెద్ద వ్యాపారవేత్త లేదా ఉపన్యాసకుడు “పాస్టర్” లేదా “నాయకుడు” అవుతూ ఉంటారు. మనం భారతదేశం లేదా ఇతర దేశాలలో కూడా చాలా సార్లు చూశాం, ఒక సైకిల్ తొక్కడం మరియు చదవడం వచ్చిన వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకోవడం. కానీ ఇది దేవుని తీరు కాదు. దేవుని నాయకత్వం ఎవరు బాగా చదువుతారు లేదా ఎవరికి ఎక్కువ తెలుసు లేదా ఎవరు బాగా మాట్లాడతారు లేదా ఎవరికి వ్యాపారంలో మంచి అనుభవం ఉంది లేదా మంచి చదువు, సంపద, అందం ఇతరత్రా వాటిపైన ఆధారపడి ఉండదు.

యేసులా జీవించడం

గ్రంధాల నుండి మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఆక్ట్స్ 6 లో కొందరు గ్రీకు వితంతువులు ఎవరు పట్టించుకునేవారు లేక కొన్నిసార్లు ఆకలితో ఉండేవారు. భోజనం పంచే సమయంలో కూడా వారిని ఎవరు సరిగ్గా పట్టించుకొకపోగా వదిలేసేవారు. జెరాసులేంలోని చర్చివారు ఈ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి కొందరిని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. మీరు మీ బైబిల్ ని చదివినట్లైతే ఆ పురుషులను ఎంచుకోవడానికి ఒక స్పష్టమైన మార్గం ఉందని తెలుస్తుంది. “ఎవరికితే వారి బైబిల్ గురించి బాగా తెలుసో ఆ ఎడుగురిలో నుండి ఎన్నుకోమని,” బైబిల్ చెప్పిందా? లేదు. “ఆ ఎడుగురిని వ్యాపారం లేదా ఆహార వ్యాపారంలో మంచి అనభవం ఉన్నవారిని ఎన్నుకోమని,” చెప్పిందా? లేదు. ఆ సమస్యను పరిష్కరించడానికి మార్గం ఏమిటంటే, “మంచి జ్ఞానం కలిగి పవిత్రాత్మతో నిండి ఉన్న ఏడుగురిని ఎంచుకోవడం.”

వీరిని ప్రతిరోజూ పరీక్షించే వారు. వీరు ఆధ్యాత్మికత కోసం బడికి వెళ్ళినవారో లేదా కేవలం మంచిగా మాట్లాడగలిగిన వారో కాదు. వీరు దేవుని స్నేహితులు మరియు ప్రతిరోజూ వారి సోదర సోదరీమనులకు దగ్గరి స్నేహితులు. స్టీఫన్ మరియు ఫిలిప్ మరియు ఆ ఏడుగురు సహాయకులు ప్రతిరోజూ ప్రజలకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ వారి ఇండ్లలోనే ఉండేవారు. ఇతర విశ్వాసకులకు నీళ్ళు అందిస్తూ వారికి సహాయం చేసేవారు. వారి స్నేహితుల పిల్లల చేతులు పట్టుకుని వారితో మాట్లాడుతూ వారికి భోదన చేసేవారు. నిరాశ చెంది ఉన్న ప్రజల ఇంటికి వెళ్ళేవారు. రోజులో వారు ప్రజల పనిస్థలాలకు వెళ్ళి వారిని ప్రోత్సహించేవారు. మరియు వారు కేవలం పేరుకు మాత్రమే నాయకులు కాదు! వారు యేసు జీవితాన్ని ప్రతిరోజూ జీవిస్తున్న సాధారణ సోదరులు. “యేసులా ఉండే, యేసును చూడగలిగే మరియు వినగలిగే వారిలోనుండి ఏడుగురిని ఎన్నుకోండి. ప్రతిరోజూ సాధువుల పాదాలను కడిగే వారిలో నుండి ఏడుగురిని ఎన్నుకోండి. ఏడుగురు సాధారణ మరియు దేవుడిని హృదయ లోతులలో ప్రేమించే మరియు ఏసయ్యకు అతీంద్రియ అనుసంధానంగా ఉన్న ఏడుగురి సోదరులను ఎన్నుకోండి.”

ఎందుకంటే వీరు ప్రతిరోజూ ప్రజల ఇళ్లలో యేసులా ఉంటారు మరియు మనకు తెలుసు వీరు పరిశుద్ధ ఆత్మతో నిండి ఉంటారు. వారు గట్టిగా అరవడం వల్లనో, బాగా పాడడం వలనో, లేదా చాలా విషయాలు చెప్పగలగడం వలనో పరిశుద్ధ ఆత్మతో నిండలేదు. వారు జీవితంలో ప్రతిరోజూ యేసులా ఉంటూ అలానే జీవిస్తున్నారు కాబట్టి పరిశుద్ధ ఆత్మతో నిండి ఉన్నారు. బైబిల్ కేవలం ఇది మాత్రమే నిజమైన నాయకత్వం. కొత్త నిబంధనలో, యేసు వారి శిష్యులతో ఎవరినీ గురువు, తండ్రి, నాయకుడు, మాస్టర్, రబ్బీ, పాస్టర్, లేదా రెవేరెండ్ అని పిలవద్దు మీకు అందరూ సోదరులు మాత్రమే అని చెప్పారు. కాబట్టి మనకు ఇప్పుడు నాయకత్వం పట్ల ఒక అద్భుతమైన మరియు భిన్నమైన దృక్పధం ఉంది.

ప్రపంచానికి అత్యంత భిన్నంగా

వ్యక్తిగతంగా, ఇది నేర్చుకోవడం నాకు చాలా కష్టం. చాలా ఏళ్ల క్రితం వరకు బైబిల్ లో చెప్పిన విధంగా నేను కేవలం సోదరుల మధ్య సోదారుడినే అని గ్రహించే ముందు వరకు నేను కూడా ఒక పాస్టర్ గా ఉండేవాడిని. నేను ఒక యజమాని లేదా అధికారిలా కాకుండా ఒక సేవకుడిగా మాత్రమే నాకున్నది ఏదయినా వాడుకోవాలి. ఇది పీటర్, జాన్, జేమ్స్, మరియు ఇతర శిష్యులందరికీ వర్తించినప్పుడు మనందరికీ కూడా వర్తిస్తుంది, ఎవరూ మినహాయింపు కాదు! “మనమంతా కేవలం సోదరులం మాత్రమే.”

నేను పాస్టర్ అవ్వడానికి వ్యాపార రంగంలో సంపాదించిన సంపదలన్నింటినీ విడిచి వచ్చేశాను. ఇప్పుడు నేను డబ్బును మరియు బైబిల్ కు వ్యతిరేకంగా అందరూ చర్చి పాస్టర్ అని పిలవబడే స్థాయిని విడిచి వచ్చేయాలి. నేను కేవలం సోదారులలో సాటి సోదారునిగా మాత్రమే ఉండాలని నిర్ణయించుకున్నాను. నా జీవితంలో యేసు చేసిన ప్రతిదీ నేను బిడ్డల చేయి పట్టుకున్నప్పుడు అందరి ఇళ్ళలో కనిపిస్తుంది మరియు వారి జీవితంలో కూడా జరుగుతుంది. నేను ఇంక పెద్ద పేరుగల వారిలానో లేదా వ్యాపారవేత్త లాగానో ఉండాలి అనుకోవట్లేదు! ఇంక ముఖ్య మనిషిలా ఉండాలి అనుకోవట్లేదు. థెస్సలొనీయన్స్ మరియు ఫిలిపపియన్లను మరియు కోరింత్ నగరంలోని విశ్వాసకులను పాల్ ఎలా అయితే ఇంటింటికీ వెళ్ళి అక్కడ ప్రజలను ఒక తండ్రిలా, స్నేహితునిలా మరియు సోదరనిలా ప్రేమించాడో, నేను కూడా అలానే చేయాలి అనుకుంటున్నాను.

“నేను ఇంటింటికీ కన్నీరుతో వెళ్ళాను,” అని పాల్ చెప్పాడు. అతను ప్రజలను ఒక తండ్రిలా లేదా ఒక సోదరనిలా ప్రేమించాడు. ఒక బిడ్డను తల్లి పెంచి ప్రేమించినట్లు అతను వారి జీవితాలను పెంచి ప్రేమించాడు. విశ్వాసకులు కూడా అతడి పట్ల అలానే ఉన్నారు. కొత్త నిబంధనా చర్చిలో ఇదే నిజమైన నాయకత్వం.

యేసు తన శిష్యులతో, “అన్యజనులకు ఒక విధ్యమైన నాయకత్వపు పద్దతులు ఉంటాయి కానీ మనకు కాదు,” అని చెప్పారు. నిజమైన చర్చిలో, అంటే ఎక్కడైతే నరకపు ద్వారాలు విస్తరించవో ఆ చర్చిలో, ప్రపంచ వ్యవస్థకు, దాని మార్గాలకు అత్యంత భిన్నంగా నాయకత్వపు పద్దతులు ఉంటాయి. నాయకత్వం అనేది మన లోపాలనుండి రావాలే తప్ప పైనుండి ఎవరో అధికారం చూపిస్తే కాదు.

యేసు బహుమతులు మరియు అధికారం

నేను ఇప్పుడు మీకు ఒక బొమ్మ గీసి చూపిస్తాను. ఎఫెసియన్స్ 4 లో యేసు స్వర్గానికి వెళ్లారని, ఆయన మనుషులకు బహుమతులు ఇచ్చారని బైబిల్ చెబుతుంది. యేసు తనకు ఉన్న అన్ని బహుమతులను తీసుకుని ( మరియు అతనికి అనేక ఆథ్యాత్మిక బహుమతులు కూడా ఉన్నాయి కదా!) అన్నీ తన ప్రజలకు ఇచ్చేశాడు. అతడు వాటిని తన ప్రజలకు ఇచ్చాడే తప్ప ఏ పాస్టర్ కో వేరే ఏ నాయకుడికో ఇవ్వలేదు. గ్రంధాలు చెప్పిన దానిని బట్టి అతడు తన బహుమతులను అన్నింటినీ తెసుకుని తన పూర్తి శరీరానికి ఇచ్చాడు. పరిశుద్ద ఆత్మను సంపూర్ణ చర్చికి బహుమతిగా ఇచ్చినట్లు బైబిల్ చెబుతుంది. నీవు నిజంగా క్రైస్తవుడివి అయితే, నిజంగా యేసు కోసం నీకు నువ్వుగా నీ జీవితాన్ని విడిచిపెట్టేస్తే, పరిశుద్ద ఆత్మ నీకు ఒక ప్రత్యేకమైన బహుమతిని ఇస్తుంది. నీ బహుమతి యేసులోని భాగమే.

యేసు స్వర్గానికి వెళ్ళే ముందు, “స్వారగం మరియు భూమి పైన సర్వ అధికారము నాదే,” అని చెప్పారు. యేసు అలా చెప్పాడని మీకు గుర్తుందా? సర్వాధికారము యేసుకి మాత్రమే చెందుతుంది, ఇంకెవరికీ కాదు! కాబట్టి, యేసు తనలోని భాగాన్ని నీకు ఇస్తే, ఇంకొక భాగం ఒకరికి, మరొక భాగం మరొకరికి, ఇలా ఎవరికి ఏ పరిశుద్ద బహుమతులు ఇచ్చినా ఆ బాహుమతిలో అధికారం ఉంటుంది. యేసు బహుమతులను ఇచ్చాడు మరియు అతనికి సర్వాధికారం ఉంది.

బైబిల్ చాలా రకాల బహుమతులను పేర్కొన్నారు. ఉదాహరణకు, పరిశుద్ద ఆత్మ జాలిని బహుమతిగా ఇచ్చ్చినట్లైతే, ఆ జాలి అనే బహుమతి కూడా యేసులోని భాగమే. యేసు తనలోని భాగాన్నేకొందరికి ఇచ్చాడు. ఇది ఒక అతీంద్రియ బహుమతి. మన అందరికీ జాలి ఉండాలి కదా! వద్దా? కానీ అది పరిశుద్ద ఆత్మ యొక్క ఒక అతీంద్రియ జాలి గుణం. మరియు సర్వాధికారం యేసుదే. కాబట్టి, ఒకవేళ నీకు జాలి అనే ప్రత్యేక బహుమతిని యేసు ఇస్తే, నేకు జాలి అనే దానిపై అధికారం ఇచ్చినట్లే. ఒకవేళ నీకు ఆ అతీంద్రియమైన జాలి అనే బహుమతి ఉన్నట్లైతే మరియు నా దగ్గర లేనట్లైతే, సర్వాధికారం యేసుకు చెందుతూ, యేసులోని భాగం నీ వద్ద ఉంటే, నీలోని ఆ బహుమతి వలన మ గౌరవం నీకు లభిస్తుంది. ఆ గుణం పై నీకు అధికారం ఉంటుంది. నీకు అర్థమైందా? ఇదే నాయకత్వం అంటే!

సర్వాధికారం యేసుకే చెందుతుంది మరియు మన అందరికీ సొంత ప్రత్యేక బహుమతులు ఉన్నాయి. ఉదాహరణకు, బోధనకు సంబంధించిన బహుమతులు ఉన్నాయి అనుకుందాం. హెబ్రేవస 5, “మనమందరం ఇప్పుడు ఉపాధ్యాయులుగా ఉండాలి,” అని చెబుతుంది. కానీ ఎఫెసియన్స్ 4 మరియు రోమనుల 12 లో యేసు ఇచ్చిన అతీంద్రియ బోధనా బహుమతులు ఉన్నాయని చెప్పబడింది. దాని అర్థం యేసు దానిని ఇచ్చారు మరియు అతనికి సర్వాధికారం ఉంది కాబట్టి ఆ బాహుమతిలో అధికారం ఉంది. దేనిలో మనము ఒకరికొకరు సమర్పించుకోవాలి. కానీ బోధన అనేది కేవలం ఒక బహుమతి మరియు యేసులోని ఒక భాగం మాత్రమే. సర్వాధికారం యేసుకే చెందుతుంది కాబట్టి మరియు మనలో ప్రతి ఒక్కరికీ ఉన్న ప్రతి బహుమతి యేసులోని ఒక భాగం కాబట్టి, మనమంతా మనలోని బాహుమతులకు ఒకరికొకరం లొంగిపోవలి ఎందుకంటే వాటిని మనలో ఉంచినది యేసు కాబట్టి.

ఇక్కడేమి ఒకరికి మాత్రమే అధికారమిచ్చి మిగిలిన వారు కేవలం కూర్చుని చూడడం కాదు. మనుషులు గత 1800 సంవత్సరాలకు పైగా చర్చిని ఈ వ్యవస్థను నిర్మించిన విధానం వలన మనం అలా కేవలం ఒకటే బహుమతి ఉందేమో ఆ బాహుమతే పాస్టర్ ఏమో అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాం. (లేదా మిగిలిన ప్రతి ఒక్కరూ డబ్బులు ఇవ్వాలి అనే బహుమతిని పొందినట్లు అనుకుంటున్నాం!) కానీ పాస్టర్/ కాపరి అనేది కేవలం ఒక బహుమతి మాత్రమే. మనం తప్పుగా నిర్మించినట్లైతే, మనమంతా ఒడిపోతాం. ఒకవేళ కేవలం ఒక్క మనిషిని మాత్రమే పాస్టర్ ని చేసి ముందుకు నెట్టి మాట్లాడించి, మిగిలిన వారంతా ఎప్పుడూ కూర్చుని వింటూ ఉంటే వారివారి బహుమతులను పంచే అవకాశం రాదు. వారు కేవలం పాస్టర్ యొక్క బహుమతులను మాత్రమే పొందగలరు. అది చాలా తక్కువ మరియు స్వచ్చమైనది కాదు. మనం దేవుని యొక్క గొప్పతనాన్ని మొత్తం చూడాలి అనుకుంటే మరియు మన జీవితాలు మన పిల్లల జీవితాలు మారడం చూడాలి అనుకుంటే మనకు యేసు సంపూర్ణంగా కావాలి. మనకి కేవలం యేసులోని ఒక భాగం ఉంటే సరిపోదు కదా! ఆమెన్!!

మారడానికి మరియు పరిగెత్తడానికి ధైర్యం

మీకు ఖచ్చితంగా ధైర్యం ఉండాలి అని ఎందుకు చెప్పామో అర్థమైందా? మనుషులు వస్తువులు అన్నీ ఖచ్చితంగా మారాలి! ఇప్పుడు చేస్తున్నదే ఎప్పటికీ చేస్తూ ఉండలేరు. మీరు మీ బహుమతులను బాగా వాడుతూ ఇతరులను కూడా అలానే చేయడానికి ప్రోత్సహించాలి. ఇలా చేయాలా వద్దా అని మీరు నిర్ణయించుకోబోతున్నారు. విధేయతతో మరియు ధైర్యంగా ఉండాలి అనే నిర్ణయం తీసుకోబోతున్నారు. ఒకవేళ మీరు ఎక్కడ కూర్చున్న వారు అక్కడే ఉండి మీ బహుమతులను సరిగ్గా వాడకపోతే అవి తగ్గిపోతాయి. “ఒకరు మీ పైన నమ్మకం ఉంచినప్పుడు లేదా ఒకరు మీకు బహుమతి ఇచ్చినట్లైతే వారికి మీరు తగిన నమ్మకం ఇవ్వాలి.” తన ప్రతిభను వాడకుండా పాతిపెట్టిన మనిషికి ఏం జరిగిందో గుర్తుందా? యేసు అతడిని, “నువ్వు ఒక చెడ్డ మరియు సోమరి పనివాడివి” అని అన్నాడు. మనం చేయవలసినది చేయకుండా ఉంటే మనల్ని యేసు అలానే అంటాడు. నేను నా బహుమతిని వాడకపోయినా లేదా మీరు మీ బహుమతిని వాడకపోయినా మనమంతా “చెడ్డ మరియు సోమరిపోతులమే.”

మనుషుల సాంప్రదాయాలు దేవుని వాక్యాన్ని ఏ విధంగా దొంగలించి దోచుకుంటున్నాయో మీరు చూశారా? మీరు ఒక ఒలింపిక్ పోటీదారుడు అనుకోండి, మీరు మంచం మీద పడుకుని ఉన్నారు మిమ్మల్ని ఎవరో తాడుతో కట్టేశారు. అప్పుడు ఏం చేస్తారు? మీరు గొప్ప క్రీడాకారుడు అయినప్పటికీ మీరు తాడుతో కట్టివేయబడితే, మీ కండరాలు కృశించి తద్వారా మరణిస్తారు. మీరు నెలలు లేదా సంవత్సరాల పాటు కట్టివేయబడి ఉంటారు కాబట్టి మీ సామర్ధ్యాన్ని కోల్పోతారు. మనుషుల సాంప్రదాయాలు దేవుని వాక్యాన్ని ఏ విధంగా దొంగలించి దోచుకుంటున్నాయో మీరు చూశారా? మనం గత 1800 సంవత్సరాలపైగా దేవుని ఇంటిని నిర్మిస్తూ వచ్చిన తీరు చాలా వరకు దేవుని ప్రజలను మంచాలకు కట్టిపడేస్తుంది. వారు లేవలేరు, పరిగెత్తలేరు, వారి లక్ష్యాలను చేరుకోలేరు, ఎందుకంటే మనుషుల ఇన్నిరోజులూ దేవుని వాక్యం వినకుండా తప్పుగా నిర్మించబడ్డారు. మనం చర్చిని ఎవరో ఒకరిని ఉద్దరించడానికి మాత్రమే నిర్మిస్తే, మిగిలిన వారి బహుమతులను అణిచివేస్తే, సమూహంలో ఒక్క కలుపు మొక్క కారణంగా చాలా మంది నష్టపోతారు. కాబట్టి మనం స్వర్గపు సభలో దోషులుగా పరిగణింపబడుతాం. ఈ తప్పుడు నిర్మాణం అనే పొరపాటు చెడ్డ మనుషుల వలనో ఇంకేదో చెడు వలనో జరగడం లేదు. చాలా వరకు కేవలం మనకు దేవుని ఇంటిని దేవుడు అనుకున్నట్లుగా ఎలా నిర్మించాలో తెలియక ఆ తప్పు జరుగుతుంది.

కాబట్టి గుర్తుపెట్టుకోండి, మొదటి పునాధి రాయి “కేవలం నిజమైన క్రైస్తవులు మాత్రమే చర్చి సభ్యులుగా పరిగణింపబడతారు.” రెండవ పునధి రాయి “నాయకత్వాన్ని సరైన విధంగా అర్థం చేసుకోవడం.” మనం గత 1800 సంవత్సరాలుగా ఒకరికే అధికారం ఇచ్చాం. మనం కేవలం ఒక్క బహుమతిని మాత్రమే తీసుకుంటున్నాం. అదే కాపరి యొక్క బహుమతి. దానినే ప్రధమ బహుమతిగా భావిస్తూ వచ్చాం. కానీ ఇది బైబిల్ లో చెప్పిన చర్చి విధానానికి చాలా భిన్నంగా ఉంటుంది. మరియు ఇప్పడు ఇది నిజం కూడా కాకపోవచ్చు. ఈ విధానం చాలా మంది దేవుని ప్రజలను మంచాలకు కట్టిపడేసి దేవుడు చెప్పిన మార్గంలో వెళ్లనివ్వకుండా చేస్తుంది. నాయకత్వం అనేది దేవుని ప్రజలందరిలో ఉంటుంది. బైబిల్ మనల్ని మతాధికారుల రాజ్యాంగా పిలుస్తుంది. బైబిల్ మతాధికారుల రాజ్యాంగా చెప్పిందే కానీ మతాధికారులు గల రాజ్యాంగా చెప్పలేదు. ఇది కేవలం పాత నిబంధనలోని మతాధికారుల ప్రత్యేక సమూహం మాత్రమే కాదు. కొత్త నిబంధనలో దేవుని ప్రజలందరూ ఒకరికొకరు మతాధికారులే. “అవకాశం రెండవ వారికి వచ్చినప్పుడు, మొదటి వారు మౌనం వహించాలి,” అని దేవుడు చెప్పాడు.

మీరు జ్ఞానంతో మరియు పరిశుద్ద ఆత్మతో నిండి ఉంటే మీరు ఒక నాయకుడే. దానికి నువ్వు బడికి వెళ్లావా లేదా మంచిగా మాట్లాడడం వచ్చా రాదా అనేది పరిగణలోకి రాదు. నీవు మగా, ఆడా, చిన్నా, పెద్దా అనే విషయంతో సంభంధం లేదు. నాయకడు అంటే ఆ మనిషికి యేసు ఇచ్చిన బహుమతి ఉందా లేదా, దేవునితో అతని సంభంధం ఏంటి, పరిశుద్ద ఆత్మ మరియు జ్ఞానంతో నిండి ఉన్నాడా అనేవి మాత్రమే పరిగణలోకి వస్తాయి. నాయకత్వం అంటే ప్రతిరోజూ బిడ్డల చేతులు పట్టుకోవడం, దేవుని ప్రజల ఇంటింటికీ తిరుగుతూ వారి గాయాలను మాన్పించడం, ప్రజల జీవితాలలోని పాపాలు కదిగివేయడానికి సహాయపడడం మరియు వారి పాదాలను శుభ్రపరచడం. ఇదే నాయకత్వం అంటే. యేసు మనలో ప్రతి ఒక్కరిలో తన పరిశుద్ద ఆత్మను ఉంచాడాని బైబిల్ చుబుతూ నిజమైన నాయకత్వం అంటే ఇదే అని నిర్వచించింది. అదే మన నాయకత్వం మరియు అధికారం. అంటే మనం ప్రస్తుతం ఎలా ఉన్నామో ఆ తీరును మార్చుకోవాలి. మనం నాయకత్వం పైన మనకున్న భావనను మరియు దానిలో పని చేసే తీరును మార్చుకోవాలి.

ఇది చాలా విప్లవాత్మకమైనది. ఇది మనం మన సమావేశాల్లో ఉండే తీరును మరియు మన నిత్య జీవితంలోని జీవన విధానాన్ని మారుస్తుంది. దీనికి అంటూ మనం చెల్లించాల్సిన మూల్యం ఉంటుంది. కానీ యేసు ప్రమాణం చేసిన విధంగా దేవుడు మనం చెల్లించిన మూల్యానికి 100 రేట్లు ప్రతిఫలాన్ని అందజేస్తాడు.

నేను “పాస్టర్” గా ఉన్న సమయంలో, నేను భిన్నంగా జీవించాలి అని నిర్ణయించుకున్నాను. నేను నాయకత్వం గురించి గ్రంధాలలో చెప్పిన దానిని నమ్మి ఆ విధంగా ఆచరించాలి అని అనుకున్నాను. నేను సోదరుల ఎదుట కాకుండా సాటి సోదరునిలా ఉండాలి అని అనుకున్నాను. నిజానికి నేను అప్పుడు చాలా భయపడ్డాను. నేను నా కుటుంబాన్ని ఎలా పోషించాలి అని భయపడ్డాను. నేను దేవునితో సంభంధం కోల్పోతానేమో ప్రజలు నన్ను గౌరవించడం ఆపేస్తారేమో అని భయపడ్డాను. నేను ఇంకా చాలా వాటి గురించి భయపడ్డాను. కానీ బైబిల్ లో దేవుడు ఏం చెప్పాడో నాకు తెలుసు. ఆయన నన్ను సోదరుల మధ్య సాటి సోదరునిలా ఉండాలి అనుకుంటున్నాడు. నా దైనందిన జీవితంలో, నేను ఇకమీదట యజమాణిని కాలేను. నేను కేవలం మిగిలిన సోదారులతో కలిసి ఒక సోదరునిలా నాకు యేసు ఇచ్చిన బహుమతులను అందరి మాదిరిగానే సమానంగా ఉపయోగించుకుంటూ జీవిస్తాను. నాకు అంతా మారిపోయింది. కానీ దేవుడు చాలా చాలా నమ్మకస్థుడు. మనం విడిచి పెట్టిన దానికి వంద రేట్లు మనకు అందిస్తానని దేవుడు ప్రమాణం చేశాడు. దేవుడు అతని ప్రమాణాలను నిలబెట్టుకున్నారు. ఆమెన్!

సింహాసనం చుట్టూ వలయం

ఆచరణాత్మక దృక్కోణం నుండి, నేను మీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటి అంటే దేవుడు మనలో ప్రతీ ఒక్కరికీ ఇచ్చిన బహుమతులను గౌరవించాలన్నా వాటిని బయటకు తీసి ఉపయోగించాలన్నా మనం చాలా మార్పులు చేసుకోవలసి ఉంటుంది. వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ వాటిలో ఒకటి మనం మార్చుకోవాలసిన వాటిలో ఒకటి సమావేశ సమయంలో ఎలా కూర్చుంటామనేది. యేసు ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన చుట్టూ ఒక వృత్తాకారంలో మనుషులు కూర్చొని ఉండేవారు. “ఆయన చుట్టూ కూర్చుని ఉన్న ప్రజలారా వీరంతా మా తల్లులు, మా సోదర సోదరీమణులు” (మార్క్ 3). ఆయన చుట్టూ వృత్తాకారంలో కూర్చుని ఉండేవారు! మనం ఆయన గురించి లేదా ఆయన నుండి వినడానికి సమావేశం అయినప్పుడు అలా కూర్చోవడం చాలా సాధారణ విషాయమే కదా! ఆయనేమీ కొన్ని బాహుమతులతో మాత్రమే ఉన్న సాధారణ మామూలు మనిషి కాదు, అన్ని బహుమతులపైన అందరిపైన సర్వాధికారం ఉన్నవాడు. ఇది మీకు చాలా తేలకగా అనిపించవచ్చు మరియు అంత ముఖ్యమైన విషయంలా అనిపించకపోవచ్చు, కానీ నన్ను నమ్మండి అది చాలా ముఖ్యం. పల్పిట్ మరియు మాంసం రెండిటినీ ఫ్రెంచ్ లో ఒకేలా పలుకుతారట అని నేను ఒకసారి ఎక్కడో విన్నాను.

ఒకవేళ మీరు పని చేసే చోట లేదా బైట మార్కెట్ లో ఎవరయినా ఏదైనా మీకు చెబితే, ఎలా చెబుతున్నారు అనేది ముఖ్యమా? ఖచ్చితంగా ముఖ్యమే! ఒకవేళ వారు ఏదో రాయికో గోడకో అనుకోని అవలిస్తూ చిన్నగా మీతో చెబుతున్న దానికి వారు ముఖాన్ని నిటారుగా ఉంచి మీ కళ్ళలోకి చూస్తూ ఉత్సాహంతో చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఎలా చెబుతున్నాం ఎలా కూర్చున్నాం ఎలా వింటున్నాం అనేది చాలా ముఖ్యమైనదే.

మనం అందరం ఒకెవైపుకు తిరిగి ఒకరినే చూస్తూ కూర్చుంటే శ్రద్ధ అంతా ఒకరిపైనే ఉంటుంది. అప్పుడు అందరూ ఒకటే సమానమే అనే భావన రాదు. నేను కేవలం నా ముందు సింహాసనంపైన కూర్చున్న వారికి ఆధీనుడను లేదా కిందవాడను అనే భావన కలుగుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి! దేవునికి నిజమైన సేవకుడు ఎప్పుడూ అందరి శ్రద్ధ తన పైనే ఉండాలి అని కోరుకొడు. ఒక గొప్ప స్త్రీకి జన్మించిన గొప్ప మనిషి మరియు బాప్టిస్ట్ అయిన జాన్, “యేసు ఎదగలి, నేను తగ్గాలి,” అన్నారు. యేసు నిజమైన సేవకుడైన ప్రతి మనిషి అదే చెప్తారు, “యేసు ఎదగలి, నేను తగ్గాలి. నేను ఎవరి ధ్యాస నా పైనకి మరల్చుకోవాలి అనుకోవట్లేదు. ప్రతిసారీ ప్రజలు నా వైపు అన్నీ సమాధానాలు గల వాడిలా చూడాలని నేను అనుకోవట్లేదు. నేను ఒక్కడినే మాట్లాడుతూ ఉంటే సంతోషపడను. నాకు కేవలం యేసును ప్రేమిస్తూ ఆయనకు సేవ చేస్తూ ఇతరులు కూడా అలానే చేయగలిగేలా సహాయం చేయాలని అనుకుంటున్నాను. యేసు ఎదగలి, నేను తగ్గాలి.”

దేవుని యొక్క ప్రతి నిజమైన సేవకుడు దేవుడు వెలుగులోకి రావాలని కోరుకుంటూ తాను తప్పుకుంటాడు. మళ్ళీ, కొంతమంది అసలు దేనిలో అర్థమే లేదంటారు. కానీ, చాలా నగరాలు దేశాలు తిరిగిన వడిగా నేను మీకు చెబుతున్నాను, ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం ఏదయినా విషయం ఎలా చెబుతున్నాం అనేది చాలా ముఖ్యం. మనం వృత్తాకారంలో కాకుండా వరుసగా కూర్చున్నట్లైతే, మన శ్రద్ధ అంతా ఒకరిపైనే ఉంచుతున్నట్లు. మిగిలిన వారంతా ప్రేక్షకులు మాత్రమే కేవలం మాట్లాడతున్న వ్యక్తి వెలుగులోకి వస్తాడు. కానీ అది చాలా తప్పు ఎందుకంటే మన అందరిలో ప్రతి ఒక్కరిలో చాలా బహుమతులు ఉన్నాయి మరియు అవన్నీ కూడా యేసులోని భాగాలే. మనం అందరినీ ఒకరివైపే చూస్తూ ఉండేలా చేస్తే కేవలం ఒక్క బహుమతిని మాత్రమే గుర్తించినట్టు. మనం ఒక్క మనిషినే ప్రతిసారీ సింహాసనం అధిష్టించనిస్తే మరియు ఎప్పుడు అతనినే వెలుగులోకి ఉంచితే అతను ఎంత గర్వంగా అవుతాడు.

కాబట్టి, అలా కాకుండా అన్నీ బహుమతులు సమానంగా ఉంది ఒకేలా చూస్తే ఎలా ఉంటుంది? ఆ వృత్తంలో ఎవరొకరిలో కాపరి బహుమతి ఉందేమో. ఒకరిలో గురువు బహుమతి ఉందేమో మరొకరిలో జాలి బహుమతి ఉందేమో. సహాయం అనే బహుమతి ఉనవాళ్ళు కూడా ఇక్కడ కూర్చుని ఉండవచ్చు. అన్నీ బహుమతులు సమాన స్థానం కలవి ఎందుకంటే అవన్నీ యేసు ఇచ్చినవే. ఇది మీకు అర్థమవుతుందా? (మీ వద్ద కంప్యూటర్ ఉన్నట్లయితే ఒకసారి JesusLifeTogether.com/JesusAsHead కి వెళ్ళి అక్కడ ఉన్న బొమ్మను చూడండి.)

ఇప్పుడు ఉదాహరణకు ఈ సమూహంలో ఎవరైనా ఒక తల్లి వారి పిల్లల పాలన గురించి విలపిస్తూ ఉంటే, మనలోని గురువు బహుమతి కలవారు లేచి తనతో మాట్లాడి పాల్ టీటస్ లో స్త్రీల గురించి చెప్పిన దాని గురించి మనకు భోధిస్తారు. జాలి అనే బహుమతి గలవారు కూడా వారి అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకోవచ్చు, తనకి ఆ సమయంలో చిన్న పిల్లలు ఉంది ఉన్నట్లయితే వారి భావనలను కూడా పంచుకునే అవకాశం ఉంది. ప్రవచనాత్మక అంతర్ధృష్టి బహుమతిగా కలవారు ఆ సోదరి హృదయంలోకి చూసి ఆమె పిల్లలతో గల సమస్యలను గ్రహించి సహాయపడే అవకాశం ఉంది. ఇప్పుడు, చివరికి మనం నిజాయితీగా దేవుని ఆజ్ఞ అయిన, “అవకాశం రెండవ వారికి వచ్చినప్పుడు, మొదటి వారు మౌనం వహించాలి,” అనే దానిని పాటించవచ్చు. హల్లెలూయ!! (అరుపులు మారుమ్రోగాయి!)

అందరూ, సమానంగా ముఖ్యమే

1వ కొరయిన్థియన్స్ 14 లో, దేవుడు, “మీరు సోదారులగా కలిసి వచ్చినప్పుడు, మొత్తం చర్చి కలిసి ఉన్నప్పుడు, సమస్తమూ దేహ నిర్మాణం కోసమే జరగనివ్వండి. మీలో ప్రతి ఒక్కరికీ సూచనా పద్యం, పాట మరియు ద్యోతకం కలవు,” అని చెప్పాడు. యేసు తప్ప వేరే ఏ యాజమాణీ లేడు. “ఏ మనిషిని నాయకుడని లేదా గురువని లేదా పాస్టర్ అని పిలవద్దు. మీరంతా సోదరులు.” మీ అందరిలో యేసు ఉన్నాడు మరియు ప్రతి ఒక్కరిలో సమానంగా ఉన్నాడు. ఒకరికొకరికి మధ్య పరిపక్వత తేడాలు ఉండవచ్చు లేదా కొందరిలోని బహుమతులు మహిరంగంగా కనిపిస్తూ కొందరిలోని బహుమతులు పైకి కనిపించకపోవచ్చు. కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి మరియు అన్నింటికీ అవకాశం కలదు. కొన్ని సార్లు మనకు యేసు జాలి కావాలి, మరికొన్ని సార్లు యేసు భోధన కావాలి. కొన్ని సార్లు మనకు యేసు పాటలు కావాలి, మరికొన్ని సార్లు సమస్యలు పరిష్కరించేందుకు యేసు సహాయం కావాలి. కానీ అవన్నీ సమానమైన యేసు మాత్రమే. దయచేసి 1 వ కొరయిన్థియన్స్ 14:26-40 ను చదవండి.

దీనంతటికీ ధైర్యం కావాలి అని మీకు అర్థమవుతుందా? దీనంతటికీ నమ్మకం మరియు విధేయత కావాలి అని మీకు అర్థమవుతుందా? మీరు ఈ విధంగా జీవించడం మొదలు పెడితే, మీ జీవితం మారుతుంది అని మీకు అర్థమవుతుందా? ఇంక మీరు ఏ మాత్రం మంచానికి కట్టివేయబడి ఉండరు! మీ బహుమతి ఎప్పుడూ వెనక్కి నెట్టి వేయబడదు. మీ బహుమతి నదానితో పోలిస్తే భిన్నమైనదేమో కానీ సమానమైనదే. మీకు నా బహుమతి ఎంతలా అయితే కావాలో, మీ బహుమతి కూడా నాకు అలానే కావాలి.

నాకు జీవితంలో జరిగిన ముఖ్యమైన వాటిలో కొన్ని జరగడానికి కారణం ఒక 12 ఏళ్ల వాడు తన బాహుమతితో నన్ను ప్రేరేపించడం. స్త్రీలు మరియు పిల్లలు కూడా నా జీవితాన్ని ప్రేరేపించారు. వృద్ధులు కూడా నా జీవితాన్ని ప్రేరేపించారు. కానీ కేవలం ఆదివారం ఉదయం మాత్రమే కాదు, ప్రతి రోజు!

మనది ప్రతి రోజు మతాధికారుల రాజ్యమే. నిజానికి, సమావేశాలు అదనపు చర్యలు మాత్రమే. మన ఎదుగుదలలో 90 శాతం కలిసి జీవించడం ద్వారానే వస్తుంది, కేవలం 10 శాతం మాత్రమే సమావేశాల వలన వస్తుంది. దాని అర్థం నీవు నీ ఇంటి నుండి బయటకు వచ్చి, ఇతరుల ఇళ్లను సందర్శిస్తూ ఉండాలి. మీరు వారి ఇంటిలోకి నీరు, ఆహారం లేదా బట్టలు లేదా ఇంకేదోకటి తీసుకువస్తారు. మీరు వారిని ఎవరితో అయిన కోపంగా మెలగడం చూస్తే వారిని పక్కకి తీసుకు వచ్చి కాసేపు మాట్లాడి అలా వారిని బయిటకు తీసుకువెళ్ళి కలిసి నడుస్తూ వారిని శాంతింప జేయలి. ఎప్పుడైనా వారి జీవితంలో గర్వం లేదా పొగరు కనిపించినట్లైతే, వారి భుజం మీద చేయి వేసి అలా ఉండవద్దని ప్రేమగా చెప్పాలి. ఏ సోదరుని జీవితంలో అయినా స్వార్థం కనిపించినట్లైతే, వారి భుజం మీద చేయి వేసి, “ఇక మీదట స్వార్థపరునిగా ఉండొద్దు,” అని ప్రేమగా చెప్పాలి. మనం కేవలం కళ్ళు మూసుకొని కాలం గడిపేయడం లేదు. మనం ఇతరుల జీవితాల మధ్యలో ఒక మతాధికారునిగా మరియు “వందలాది సోదారులుగా, తల్లులుగా, మరియు చెల్లెళ్ళుగా” జీవిస్తూ ప్రతి రోజు దేవుని కార్యాలను చేస్తున్నాము. హెబ్రేవస 3 మరియు అనేక ఇతర గ్రంధాలలో చెప్పినట్టుగా, ఇది కూడా దేవుని సంపూర్ణ ఆదేశమే.

మొదటి పునాది రాయి “క్రైస్తవుడు అంటే ఏమిటి?” “చర్చి సభ్యుడు అంటే ఎవరు?” చర్చిలో సంపూర్ణంగా యేసుకు మారనివారు ఉన్నట్లయితే, అప్పుడు మీరు నిరంతరంగా అనవసరమైన యుద్దాలు గొడవలు పడాల్సి వస్తుంది. “ఉచ్చం నుండి నీచం వరకు అందరికీ అతను తెలుసు,” అని బైబిల్ చెబుతుంది. తనని తాను చర్చి సభ్యునిగా పిలుచుకునే ప్రతి ఒక్కరూ యేసుతో ప్రేమలో ఉంటే, అత్యంత ప్రశాంతంగా మరియు గొడవలు, పుకార్లు లేకుండా ఉంటుంది. నీవు నీ జీవితాన్ని త్యజించకపోతే, యేసు చర్చిలోని నిజమైన సభ్యునివి కాలేవు. కేవలం క్రైస్తవులు మాత్రమే చర్చి సభ్యులు కాగలరు. మిగిలినవారంతా కేవలం సందర్శకులే. కానీ వారు యేసు చర్చిలో సభ్యులు కాదు.

బైబిల్ కూడా ఇదే చెబుతుంది. మరియు సమూహంలోని కలుపు మొక్కను తప్పనిసరిగా పీకివేయాలి. లేదంటే మనం మాటల్లో చెప్పినంత యేసును ప్రేమించలేము. “నీవు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను పాటిస్తావు.” ఆయన రక్తంలో పరిశుద్దం చెందిన వారు కలిసి, బలోపేతం చెంది, సంరక్షించుకోడానికి చర్చి ఉన్నది. మరియు వారికి వారుగా యేసుతో శాశ్వతంగా కలిసిపోవడానికి వారి జీవితాలను వదిలేయడానికి సిద్దమైనవారి కోసం. ఎవరైనా ఆ నిర్ణయం తీసుకోనివారు, వారి జీవితాలను మరియు ఎంపికలను బట్టి వారు వెలుగు ప్రేమించినా ప్రేమించకపోయినా వారు క్రైస్తవునిగా లేదా యేసు యొక్క దేహంలోని సభ్యునిగా పరిగణింపబడరు. ఇవి దేవుడు చెప్పిన మాటలు.

చర్చి గురించి మరే నిర్వచనం అయిన సరే మానవ కల్పితమే మరియు నరకం యొక్క ద్వారాలు అలాంటి నిర్వచనాలకు లొంగవు. చుట్టూ చూడండి. మీరు ప్రతి దేశంలో ప్రతి నగరంలో ప్రతి వీడి మూలలో సైతం ఇదే చూస్తారు. ఇది దేవుని నిర్మాణము కాదు, కేవలం మానవుని కల్పితనికి దేవుడు అనే ముద్ర వేసి వారి మనస్సాక్షిని రక్షించడానికి చేసే చర్య మాత్రమే. కానీ అక్కడ ఎటువంటి స్వస్థత ఉండదు. ఆయన దీపం వదిలిన చోటులో మాత్రమే అనగా వెలుగు నింపి వెళ్ళిన చోటులో మాత్రమే మెస్సీయ తిరుగుతాడు.

రెండవ పునాధి రాయి నాయకత్వానికి సంభందించింది. పునరుత్థానం చేయబడిన క్రీస్తు యొక్క ఆత్మ మరియు ప్రస్తుత జీవితం కేవలం మన నాయకుడు మాత్రమే. “ప్రపంచం నన్ను చూడలేదు, కానీ నువ్వు చూడగలవు!” ఆత్మకు ఎవరికైనా ఉండే ఏకైక పరిమాణం, ఎవరికైనా ఉండగలిగే బహుమతి, నిజానికి గల పరిపక్వత మరియు లోతు, సజీవమైన యేసుతో వారికి గల సహజీవన సంబంధం, ఇవన్నీ నాయకత్వానికి గల బైబిల్ నిర్వచనం.

మూడవ సత్యం: రోజువారీ జీవితం

మూడవ పునధి రాయి అందరితో కలిసి ఉండే రోజువారీ జీవితం గురించి మరియు మనం దాని గురించి ఇంతకు ముందు చర్చించాం. మనం ఎన్ని సమావేశాలకు వెళ్ళాము అనేది రోజువారీ జీవవితంతో సంబంధం ఉండదు. రోజువారీ జీవితం అనేది ముఖ్యంగా ఇతరులతో కలిసి ఒకరి జీవితాలలో మరొకరు ఎంత బాగా సంబంధాలు కలిగి ఉన్నారు అనే దాని పైన ఆధారపడి ఉంటుంది. మనం రోజు వివాహాలలో మతాధికారుల వలే, మన చుట్టూ ఉండే పిల్లలతో, మనా చుట్టు ఉండే వారి పనిలో అలవాట్లు మరియు ప్రవర్తన గుణాలు గురించి ఎంత తెలుసు? మనం సోదర సోదరీమనులతో రోజువారీ మనస్పూర్తిగా కలిసి ఉంటున్నామా? మనం ఒకరి బాధలు ఒకరు పంచుకొని క్రీస్తు ధర్మాన్ని నిర్వర్తిస్తున్నామా? ఒకరికొకరు పాపాలను వ్యక్తపరచి స్వస్థత పొందుతున్నామా? మనం ఒక్కరితో ఒకరు నిజాయితీగా ఉంటూ నిజమైన చర్చి మరియు క్రీస్తు యొక్క దేహం తప్ప మరేమీ ఆశించకుండా ఉంటున్నామా? కేవలం అలాంటప్పుడు మాత్రమే యేసు చెప్పినట్లు, “నరకం యొక్క ద్వారాలు నిలువలేనంతగా నేను నా చర్చిని నిర్మిస్తాను,” అర్థం కనిపిస్తుంది. మిగిలినది ఏదైనా సరే మట్టిపైన రాజీ, ఆవిధేయత మరియు హేతుబద్ధీకరణతో కట్టబడిన నివాసం మాత్రమే. దురధృష్టవశాత్తు అది కూడా సుమారు ఒకేలాంటి ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఎలా నిర్మించాం అనేది చాలా ముఖ్యం అని దేవుడు చెప్పాడు.

నేను మీకు ఒక గ్రంధం చూపిస్తాను. మీరు దానిని నిజంగా పాటిస్తే అది మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఈ ఒక్క గ్రంధాన్ని మీరు చేయగలిగితే, ఈ మిగిలిన అన్ని విషయాలు మీకు అర్ధం అవ్వడం చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇది యేసు నుండి వచ్చిన ఆజ్ఞ. మీరు చేస్తారా మరి? చేస్తారా? మీరు అతనిని ప్రేమిస్తున్నారా? ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మరియు బోధనల గురించి తెలుసుకోవడం, వాటిని అంగీకరించడం, వాటి గురించి పాటలు పాడి సమావేశాలు పెట్టుకున్నంత మాత్రాన మీ జీవితం ఏమీ మారదు. కానీ ఆచరిస్తే మారుతుంది. మనమంతా కలిసి చూద్దాం రండి. ఆ గ్రంధమే హెబ్రేవస్ 3:12-14:

“ప్రియమైన స్నేహితులారా, జాగ్రత్త. మీ హృదయాలు చేడుగా మరియు అపనమ్మకంతో లేకుండా, సజీవ దేవునికి దూరంగా వెళ్లిపోకుండా చూసుకోండి. మీరు ఈ రోజు అనే ప్రతి రోజు ఒకరినొకరు పాపాలకు మోసపోయి దేవునికి దూరంగా వెల్లవద్దని హెచ్చరించుకోవాలి. మనం మొదటి నుండి చివరి వరకు ఒకేలా ఉంది దేవునిపై ధృడ విశ్వాసం ఉంచినట్లైతే, క్రీస్తుకు వర్తించేవి అన్నీ మనం కూడా పంచుకోగలుగుతాం.”

ఈ గ్రంధం ఏమి చెబుతుందో గమనించారా? ఇది దేవుని వద్ద నుండి వచ్చినది. దేవ దేవుడు మీకు, నాకు మరియు అందరికీ చెప్పేది ఏమిటంటే, మనం ప్రతీ రోజూ ఒకరినొకరు హెచ్చరించుకోవాలి మరియు సహాయం చేసుకోవాలి. మనం ప్రతీ రోజూ ఒకరికొకరు తోడుగా ఉండాలి. పరిశుద్ద ఆత్మ “ప్రతీ రోజూ” అని చెప్పింది. ఆయన కేవలం ప్రతి ఆదివారం అని చెప్పలేదు. ఆయన కేవలం ప్రతి ఆదివారం మరియు బుధవారం అని చెప్పలేదు. ఆయన కేవలం సమావేశాలలో అని కూడా చెప్పలేదు. ఆయన ప్రతి రోజు నిజాయితీగా ఒకరి జీవితాలలో మరొకరు పాల్గొనండి ఆన్ చెప్పారు. మిగిలిన వారు అందుబాటులో ఉన్నప్పటికీ, మీరు గర్వంతోనో, స్వార్ధంతోనో లేక జీవన శైలి తేడాల వలనో వారితో కాలవలేకపోతే, మీరు దేవుడుని అర్థం చేసుకోవడానికి కష్టతరం లేదా అసాధ్యం అవ్వచ్చు. మీకు సరైంది ఏదో తెలియకుండానే, మీకు తెలిసినదే సరైనది అని నమ్మి మోసపోతారు. గ్రంధంలో దీని గురించి ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. ఆయన కేవలం ఇది చేయండి అని చెప్పలేదు. ఇలా చేయకపోతే మీరు తీవ్రంగా బాధ పడతారు అని కూడా చెప్పారు. నా జీవితం గురించి రోజువారీ మాట్లాడేందుకు నాకు సోదరులెవరూ లేకపోతే ప్రతి రోజు నాకు గడవడం కష్టతరమవుతుంది. నేను మోసపోతాను. మీరు అనచ్చు, “నేను రోజు బైబిల్ చదువుతాను, రోజు ప్రార్ధన చేస్తాను, నా భార్య క్రిస్టియన్ నేను రోజు తనని చూస్తాను,” అని. కానీ దేవుడు చెప్పింది అది కాదు. మీరు మీ బైబిల్ ని రోజూ చదివి ప్రార్ధన చేస్తూ ఉండవచ్చు, కానీ మీరు ఒకరి జీవితాల గురించి ఒకరు పట్టించుకోకపోతే , మీరు రోజు రోజుకి కఠినంగా మారుతారు మరియు మోసపోతారు. దేవుడు దీనిని హెబ్రేవస్ 3:12-14. మీరు బైబిల్ ను నమ్ముతారా? మీరు దేవుణ్ణి నమ్ముతారా?

బైబిల్ ను ఎవరు రాశారు? దేవుడు! దేవుడు మనం రోజు ఒకరి జీవితాల గురించి ఒకరు పట్టించుకోవాలి అని చెప్పాడు. నీవు నీను స్వార్ధంగా ఉండడం చూస్తే, నా దగ్గరకు వచ్చి, “సోదరా! స్వార్ధంగా ఉండకు. అది యేసును బాధిస్తుంది.” మీరు నేను గర్వంగా ఉండడం చూసినట్లయితే, దయచేసి నాకు సహాయం చేయండి. మరియు దేవుడు గర్వాన్ని వ్యతిరేకిస్తాడాని నాకు గుర్తుచేయండి. దేవుడు నన్ను వ్యతిరేకించాలని నేను కోరుకోవట్లేదు! మీరు నాకు సహాయం చేయాలి, ఎందుకంటే ప్రతి సారి నేను ఇంత చూడలేను. ఎవరు చూడలేరు. “ప్రతి రోజూ ఒకరినొకరు ఉపదేశించుకోండి. అప్పుడు ఎవరు కఠినంగా మరియు మోసపోకుండా ఉంటారు.” ఇది మనం కలిసి ఉండేటప్పుడు మన రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన (మరియు చాలా వరకు ప్రపంచ వ్యాప్తంగా పాటించని) భాగం. ఒక మతాధికారిగా మీరు మీకున్న బహుమతులను ఉపయోగించడానికి ఇది ఒక కీలక మార్గం మరియు దీని ద్వారానే దేవుడు తన నివేధనను మీ ద్వారా చేస్తున్నాడు అంటే మిమ్మల్ని క్రీస్తు దూతగా భావిస్తునాడు అని అర్ధం.

నాలుగవ నిజం : సమావేశాలు

1800 ఏళ్లుగా క్రైస్తవ ప్రపంచమంతా క్రైస్తవుడు అంటే ఎవరు, నాయకుడు అంటే ఎలా ఉండాలి, రోజువారీ జీవితం ఎలా జీవించాలి మరియు సమావేశాలు ఎలా ఉండాలి అనే వాటి పైన స్పష్టత లేక గందర గోళంలో ఉంది. మీ జీవితాలలో ఈ విషయాలను పునరుద్ధ్ధించాలని ఫాదర్ కోరుకుంటున్నారు. చాలా రోజుల నుంచి నిర్లక్ష్యం చేసిన (కానీ బైబిల్ లో ఎప్పుడూ పొందుపరచిన) దేవుని నిజాలు మనుషులను విముక్తులను చేయగలవు. ఇవి చాలా శక్తివంతమైన మరియు విలువైన నిజాలు. మీ గ్రామంలో ఎక్కువ మంది ఉన్నారా లేదా తక్కువ ఉన్నారా అనేది ముఖ్యం కాదు. ఇలానే జొనాథన్లో డేవిడ్ దగ్గర స్నేహితుడు ఒకసారి, “ఎక్కువ మంది అయిన తక్కువ మంది అయిన ఎవరు దేవుడికి అడ్డుపడలేరు. ఆయన ఎవరితే నమ్మకం కలిగించారో అది నమ్మకమైనదే అని నిరూపించాలి,” అని చెప్పాడు. మనం గతంలో నిర్లక్ష్యం చేసిన మరియు పాటించని నిజాల గురించి ఏదైనా చేయడానికి మనకు ధైర్యం కావాలి. మరియు మీరు అతని కోసం ధైర్యంగా జీవిస్తున్నప్పుడు, అతడే స్వయంగా మీ కాపరిగా, కోటగా, మీ కాపలాగా మారుతాడు.

1 కొరయిన్థియన్స్ 14 లో బైబిల్, “సోదరులంతా కలిసి వచ్చినప్పుడు అందరికీ ఒక బోధనా పదం, పాట, మరియు ద్యోతకం ఉంటాయి,” అని వర్ణించిన విధంగా సమావేశాలు జరుపుకోవడానికి మనకు ధైర్యం కావాలి. యేసు తప్ప ఎవరు ఎవరికంటే ఎక్కువ తక్కువ కాదు. ప్రేమ మరియు మంచి పనుల పట్ల మనం ఒకరినొకరు ఎలా ప్రోత్సహించుకోవచ్చో దృష్టిలో పెట్టుకొని సమావేశం అవ్వాలి. మనం కలిసి వచ్చినప్పుడు ఒకరికొకరు ఎలా సహాయపడగలమో మరియు దేవుని ప్రేమ, మాటలకు వాహకంగా మారుటకు మనలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి అని మనం ఆలోచించాలి మరియు ప్రార్ధించాలి. మనలో ప్రతి ఒక్కరూ ప్రేమ మరియు మంచి పనుల గురించి ఒకరినొకరు ఎలా ప్రోత్సహించుకోవాలో ఆలోచించాలి. ఇది హెబ్రేవస్ 10 లో ఉంది. దయచేసి మర్చిపోకుండా తరువాతి గ్రంధం చూడండి. ఇది మన అందరికోసం, సమావేశాలలో సైతం.

1 కొరయిన్థియన్స్ 14లో, “అవకాశం రెండవ వారికి వచ్చినప్పుడు, రెండవ వారు దేవుని నుండి ఏదైనా విన్నప్పుడు, మొదటి వారిని కూర్చొనివ్వాలి,” అని చెప్పబడింది. అదే బైబిల్ కూడా చెబుతుంది. మనం బైబిల్ చెప్పినట్టు ఎందుకు చేయము? ఏ ప్రత్యేక మనిషి తనకి తానుగా ఏమి చేయడు, అందరిలాగా దేవుడు చెప్పింది విని ప్రతిస్పందించడం తప్ప. ఒకవేళ ఎవరైనా ఒకరు యేసు బోధనాల గురించి చెబుతూ మిగిలిన వారు ఏదైనా పదం, పాట లేదా దితకంతో వస్తారు. ఒకవేళ ఈ సోదరి లేదా సోదరుడు యేసు తనకు చూపినదాని గురించి పంచుకుంటున్నప్పుడు, అవకాశం రెండవ వారికి వచ్చినపుడు మొదటి వారు కూర్చొని వినాలి, మిగిలిన వారిలాగా కాకుండా దేవుని ఆజ్ఞకు స్పందిస్తున్నాము. అచ్చం బైబిల్ ఎప్పుడూ చెప్పేలాగా.

మనమెందుకు అలా చేయకూడదు? దానికి కారణం మనం రోమన్ కేథలిక్ ల నుండి, మన నిరసనకరుల నుండి, అన్యమత పూర్వీకుల నుండి వారసత్వంగా పొందిన భారీ సాంప్రదాయాలా? మతాధికారులు లేదా పాస్టర్ లు లేదా ఏం సి లు లేదా సిఈఓ లు ముందర నించొని ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు మరియు పేదలు, ప్రేక్షకులు కేవలం కూర్చొని వింటుంటారు. ఈ చర్యలు యేసు తాను అత్యంత అధికంగా అసహ్యించుకునేవి అని చెప్పారు మరియు నీకోలైటన్స్(“తన ప్రజలను జయించేవారు” అని అనువాదించబడింది) వి అన్నారు. కానీ తన కోసం మరియు మన కోసం ఇవన్నీ మారాలి అని దేవుడు అన్నారు.

బదులుగా యేసు తన చుట్టూ కూర్చొని ఉన్నవారితో, “ప్రతి ఒక్కరూ ఏదోక యజ్ఞ, పాట లేదా ద్యోతకం కలిగి ఉంటారు,” అని చెప్పారు. మనమంతా సమానులమే. అందరి సాధారణ మంచి కోసం యేసు వివిధ భాగాలను మనలో ప్రతి ఒక్కరిలో నింపాడు కాబట్టి మనమంతా సోదర సోదరీమనులం. ఇది ఎంత అద్భుతంగా ఉందో కదా! కర్మ, మతం, మరియు లౌకికం అంటూ మన పూర్వీకుల నుండి పొందిన సంప్రదాయాలను పట్టి వేలాడుతున్న మనల్ని, యేసు విముక్తులని చేస్తున్నాడు. ఆయనను సంపూర్ణంగా నమ్మి ప్రేమించే భయంకరమైన ప్రపంచంలోకి మనలను విముక్తులను చేస్తున్నాడు. మరియు అక్కడ ఎటువంటి గందర గోల ఉండదు ఎందుకంటే అతడు తనని తాను ప్రశాంతతకు మరియు ఆజ్ఞకు దేవునిగా పిలుస్తాడు గనుక. ఇది కేవలం ఆయన యజ్ఞ మాత్రమే కానీ ఆయనపై మనుష్యుల చేసే అభిసంధానం కాదు.

మార్పుకు పునాధులు

ఇది మీరుఇప్పటి వరకు ఉన్నదనికి భిన్నంగా ఉందా? దేవుని మార్గాన్ని నిర్మించడానికి మీకు ధైర్యం ఉందా? భయంగా ఉందా? లేక సరదాగా అనిపిస్తుందా? ఇది చాలా సరదాగా ఉంటుంది. కొందరు 20 ఏళ్ళకు పైగా చర్చిలో భాగస్వాములుగా మరియు క్రైస్తవులుగా ఉన్నప్పటికీ ఇంకా పిల్లలుగానే ఉంటారు. కానీ వారు ఎప్పుడైతే ఈ విషయాలన్నీ నేర్చుకొని మతాధికారులుగా వ్యవహరిస్తారో, అప్పుడు 10 ఏళ్లలో ఎదిగేది వారు ఒక్క సంవత్సరంలో ఎదిగిపోతారు. హల్లెలూయ! వందలు వేలు ప్రజలు ఉన్న చర్చిలకు కొందరు నాయకులుగా వ్యవహరిస్తూ వచ్చారు. కానీ వారు ఇంకా పరీషూధ్ధాత్మ పరంగా పిల్లలగానే పరిగణింపబడతారు అని కనుగొన్నారు! వారిని వారు నాయకులు అని అనుకున్నారు కానీ వారు కానూగున్న దాని ప్రకారం చాలా మంది పిల్లలు మరియు తల్లులు వారి కంటే చాలా అధ్యాత్మికులని. వారు పిల్లల స్థాయి నుండి ఎదగాలి మరియు ఎదిగారు కూడా. ఇదంతా చాలా భయానకంగా ఉండచ్చు కానీ చాలా ఉత్తేజంగా కూడా ఉంటుంది.

బైబిల్ లో నిత్యం ఉన్న ఈ నిజాలను మీరు ఆచరణలో పెడితే, ఇప్పటినుంది సరిగ్గా రెండేళ్లలో మీరు యేసుకు ఎంత చేరువలో ఉంటారో చూసి మీరే ఆశ్చర్యపోతారు. “ప్రతి రోజు ఒకరికొకరు ఉపదేశించుకోండి.” ప్రతి రోజు ఒకరి పిల్లలతో, వివాహాలలో మరియు పని స్థానాలలో మరొకరు పాల్గొనండి. అక్కడికి వెళ్ళండి! మీరు ఇంతకు ముందు ఎప్పుడూ వెళ్లని చోటకి మీరు ఖచ్చితంగా వెళ్ళండి. మీ సుఖ ప్రదేశం నుండి మీరు బయటకు రావాలి. అవును, మీరే! దయచేసి, యేసు కోసం! ప్రతి రోజు దేవుని మాటను మీ మాటగా ఒకరి జీవితాలలో మరొకరు ఆచరణాత్మక, ప్రేమ మరియు తెలివైన విధానంలో చెప్పుకోండి. “సోదరులారా, మీరు కలిసి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక పదం, ఆజ్ఞ, ద్యోతకం ఉంటాయి. అవకాశం రెండవ వారికి వచ్చినప్పుడు, మొదటి వారు కూర్చొని వినాలి. మీరు వీటన్నిటిలో వెళుతున్నప్పుడు, మీరు యేసును అమితంగా ప్రేమిస్తున్నారు అని అనుకున్నవారిలో అసలు యేసు పట్ల ప్రేమే లేదని అని కూడా తెలుసుకుంటారు. మీరు ఎప్పటికీ ఊహించని బలహీనులు కూడా బలంగా తెలిగా మారడం మీరు చూస్తారు. దేవుని విధానాలు దొంగలను మోసగాళ్లను పట్టించి బలహీనులను బలంగా చేస్తాయి. దేవునికి కీర్తి!

ఈ సుగుణాలు మీకు అందించబడ్డాయి. వాటిని యేసు కొరకు ఆచరణలో పెట్టండి. ఇవి పునధి రాళ్ళు. మీరు అసలైన క్రైస్తవుడు అంటే యేసు చెప్పిన విధంగా నిర్వచించాలి. మీరు నాయకత్వం అంటే ఏమిటి మరియు అది నిజంగా ఎలా ఉండాలి అని అర్థం చేసుకోవాలి. మీరు మీ రోజువారీ జీవితంలో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, నిర్మించుకుంటూ కలసి జీవించాలి. మీ సాయంకాలాలు ఒకరికొకరు సహాయం చేసుకొని యేసుని ప్రేమిస్తూ ఎదగడానికి వాడండి. యేసు రాజు చుట్టూ వచ్చి సమావేశం అవ్వండి.

మీరు యేసును ప్రేమిస్తూ సరైన మార్గాన్ని నిర్మిస్తే నరకపు ద్వరాలు ఏ మాత్రం ఎదగవు. పాపాన్ని అనగ తొక్కచ్చు. బలహీనం మరియు రోగాలకు స్వస్థత లభిస్తుంది. పాపాలకు క్షమాపణ దొరుకుతుంది. దయ ద్వారా చాలా మందికి పశ్చాత్తాపం వస్తుంది. మీ కలలో కూడా అనుకోని విధంగా సంబంధాలు నిర్మించబడతాయి మరియు పునరుద్ధీంచబడతాయి. దేవుని గొప్పతనాన్ని చూపిస్తూ మీరు విశ్వంలో ఒక తార లాగా వెలుగాడతారు. మరియు వధువు, చర్చి అన్నీ సిద్దామయ్యి వరుడు రాక కోసం వేచి చూస్తూ ఉంటాయి!! ఆమెన్?

 

jesuslifetogether.com
తెలుగు Languages icon
 Share icon